'కాళేశ్వరం' పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకు చుక్కెదురు
- October 06, 2017
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే విధించింది. అనుమతులు వచ్చే వరకు పనులు చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్టుకు అనుమతులు రాకుండానే పనులు ప్రారంభించారంటూ ఎన్జీటీలో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్... ప్రాజెక్టుపై స్టే ఇచ్చింది.
ప్రభుత్వం తరపున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. అయితే... తాగునీటి కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టామన్న తెలంగాణ ప్రభుత్వ వాదనను గ్రీన్ ట్రిబ్యునల్ పట్టించుకోలేదు. మధ్యంతర ఉత్తర్వులను 3 రోజుల పాటు నిలపుదల చేయాలన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని సైతం తోసిపుచ్చింది. అనుమతులు వచ్చే వరకు పనులు చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టుకు అడ్డంకులు తాత్కాలికమేనని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని... ప్రాజెక్టులను అడ్డుకుంటున్న కాంగ్రెస్ నేతలది పైశాచికానందమని మండిపడ్డారు. కమ్యూనిస్టులకంటే మెరుగైన సిద్ధాంతాలతో కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని... భవిష్యత్‌లో కమ్యూనిస్టులు ఒక్క సీటు గెలవరని హరీశ్‌రావు ఎద్దేవాచేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్‌లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్‌లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







