రేపే విడుదల కానున్న "నెక్ట్స్ నువ్వే " ఆడియో

- October 06, 2017 , by Maagulf
రేపే విడుదల కానున్న

ఆదిసాయికుమార్ హీరోగా, ప్ర‌భాక‌ర్.పి ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ వి4 మూవీస్ బ్యాన‌ర్ లో ప్ర‌ముఖ నిర్మాత బ‌న్ని వాసు నిర్మిస్తున్న చిత్రం ఇటీవ‌లే షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుంది.ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి సంబందించి ట్రైల‌ర్ ఇటీవ‌లే విడ‌దల‌య్యి మంచి స్పంద‌న పొందుతుంది.   హీలేరియ‌స్ కామెడి థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో వైభ‌వి, ర‌ష్మి లు హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని సాయి కార్తిక్ అందించారు. ఆయ‌న అందించిన ఆడియో ని అక్టోబ‌ర్ 7 అన‌గా రేపే  గ్రాండ్ గా విడుద‌ల చేస్తున్నారు.
నిర్మాత బ‌న్ని వాసు మాట్లాడుతూ.. వి4 మూవీస్ బ్యాన‌ర్ లో ప్రోడ‌క్ష‌న్ నెం1 గా తెర‌కెక్కిస్తున్న చిత్రం నెక్స్‌నువ్వే..  ఈ చిత్రం తో ప్ర‌భాక‌ర్‌.పి ద‌ర్శ‌కుడు. ఆదిసాయికుమార్‌, వైభ‌వి, ర‌ష్మి లు జంట‌గా,  అవ‌స‌రాల శ్రీనివాస్, బ్ర‌హ్మ‌జి, ర‌ఘు మంచి పాత్ర‌ల్ల క‌నిపిస్తారు. ప్ర‌స్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని శ‌ర‌వేగంగా పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. హీలేరియ‌స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ గా ఈ చిత్రం తెర‌కెక్కింది. సాయికార్తిక్ అందించిన సూప‌ర్ ఆడియో ని రేపు అన‌గా అక్టోబ‌ర్ 7న విడుద‌ల చేస్తున్నాము. చిత్రాన్ని న‌వంబ‌ర్ 3న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నాము. అని అన్నారు
న‌టీన‌టులు.. ఆది సాయికుమార్‌, వైభ‌వి, రేష్మి, బ్ర‌హ్మ‌జి, అవ‌స‌రాల శ్రీనివాస్‌, హిమ‌జ‌, జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డి, పృధ్వి, ఎల్‌.బి.శ్రీరామ్‌, ర‌ఘుబాబు, పోసాని కృష్ణ‌ముర‌ళి, ర‌ఘు, బెన‌ర్జి, తాగుబోతు ర‌మేష్‌, ముమైత్ ఖాన్‌, ర‌జిత‌, స‌త్య‌కృష్ణ‌, దువ్వాసి మెహ‌న్‌, రామ్ జ‌గ‌న్‌, గెట‌ప్ శ్రీను, శ్రీచ‌ర‌ణ్‌, రాఘ‌వ‌, అనురాగ్‌, సుభాష్‌, మ‌న్న‌న కొటేశ్వ‌రావు, ల్యాబ్ శ‌ర‌త్‌, ర‌మాదేవి, అనిత‌, క‌ళ్యాణి, ర‌మ‌ణి, ఆర్‌జె రాజు, ప్రేం సాగ‌ర్‌, సందీప్‌, సంజ‌య్‌, శివ‌, విక్ర‌మ్‌,రోహిణి, షాన్‌, సాత్విక్‌, మాధ‌వి, ప్రియ‌, భాషా, షా, స‌త్య‌శ్రీ, సుకుమార్‌, మ‌హ‌తి, శ్రీధ‌ర్‌, దావూద్‌, మాస్ట‌ర్ లికిత్ త‌దిత‌రులు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com