ఆ మహిళను అదృష్టమలా వరించింది

- October 06, 2017 , by Maagulf
ఆ మహిళను అదృష్టమలా వరించింది

యూఏఈ రఫాలెలో ఓ మహిళ అనూహ్యంగా బిగ్‌ 10 మిలియనీర్స్‌లో ఒకరిగా అవతరించారు. బిగ్‌ రఫాలె డ్రా సందర్భంగా ఫిలిప్పినో మహిళ ఒకరు 1 మిలియన్‌ దిర్హామ్‌ని గెల్చుకున్నారు. లీలాని క్యుజోనో డెల్‌ రొసారియా అనే మమిళ అబుదాబీలో నర్స్‌గా పనిచేస్తున్నారు. ఆమెను అదృష్టం వరించింది. ముగ్గురు పిల్లల తల్లి అయిన ఆమె, భర్త నుంచి విడిపోయారు. 14 ఏళ్ళుగా ఆమె యూఏఈ క్యాపిటల్‌లో ఉంటున్నారు. తన పిల్లలో ఇద్దరు చదువుకుంటుండగా, ఒకరు వర్క్‌ చేస్తున్నారనీ, తాను గెలుచుకున్న మొత్తంతో తన కుటుంబం హ్యాపీగా జీవనం సాగిస్తుందని చెప్పారామె. తాను సాధించిన మొత్తాన్ని తన కొలీగ్స్‌తోనూ పంచుకోనున్నట్లు లీలాని చెప్పడం గమనించదగ్గ అంశం. టిక్కెట్‌ కొనుగోలు చేయడంలో వారంతా తనకు సహకరించారని తెలిపారామె. మిగతా తొమ్మిది మంది విజేతల్లో అందరూ పురుషులే, పైగా ఇండియన్స్‌ ఎక్కువమంది ఉన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com