కారులో ప్రసవం: ఐదేళ్ళపాటు ఉచిత ప్రయాణం
- October 06, 2017
ఐశ్వరి సింగ్ విశ్వకర్మ అనే మహిళ, ఓలా క్యాబ్‌లో ఓ బిడ్డకు జన్మనిచ్చారు. డెలివరీ కోసం ఆసుపత్రికి వెళుతుండగా, కారులోనే అక్టోబర్ 2న ఆమె ఓ బిడ్డకు జన్మనివ్వడం జరిగింది. దాంతో, ఓలా కంపెనీ ఐశ్వరి సింగ్ విశ్వకర్మతోపాటుగా ఆమె కుమారుడికి ఐదేళ్ళపాటు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని 'బహుమతి'గా ప్రకటించడం గమనించదగ్గ విషయం. అక్టోబర్ 24వ తేదీని డెలివరీ డేట్‌గా డాక్టర్లు చెప్పారనీ, అయితే అక్టోబర్ 2న ఉదయం ఒంట్లో నలతగా ఉండటంతో ఆసుపత్రికి వెళ్ళేందుకు సమాయత్తమయ్యామనీ, క్యాబ్ రావడంతో అందులో కూర్చున్నామనీ, దారిలో లేబర్ పెయిన్స్ రావడం, బాబు జన్మించడం జరిగాయని ఐశ్వరి భర్త రమేష్ సింగ్ విశ్వకర్మ చెప్పారు. తన తల్లినీ, సోదరుడ్ని కారులో తన భార్యతో సహా పంపి, తాను బైక్‌లో వెనకాలే వెళ్ళాననీ, నాలుగు కిలోమీటర్ల ప్రయాణం అనంతరం, తన భార్యకి డెలివరీ అవుతోందని ఫోన్ వచ్చిందని చెప్పారాయన. చిత్రమేంటంటే ఇదే ఐశ్వరికి తొలి కారు ప్రయాణం. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. తన కారులో ఓ మహిళ ప్రసవించడం చాలా థ్రిల్‌కి గురిచేసిందని క్యాబీ యశ్వంత్ గలాండె చెప్పారు. ముందస్తుగా ఆసుపత్రికి సమాచారం ఇవ్వడంతో అప్పటికే జన్మించిన బిడ్డకు, జన్మనిచ్చిన తల్లికి తక్షణ వైద్య సహాయం అందించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..









