రష్యాలోని పెటుషిన్స్కీ ప్రాంతంలో ఘోర రైలు ప్రమాదం
- October 06, 2017
రష్యాలో శుక్రవారం తెల్లవారు జామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెటుషిన్స్కీ ప్రాంతంలోని పొక్రోవా రైల్వే స్టేషన్ వద్ద ఈ దారుణం జరిగింది. ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. రైలు వస్తుందన్న విషయాన్ని గమనించకుండా డ్రైవర్ పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే వేగంగా వస్తున్న రైలు బస్సును ఢీ కొట్టింది. ఈ ఘటనలో 19 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరి కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి.
మాస్కోకు తూర్పున ఉన్న వ్లాడిమీర్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బాధితులంతా సెంట్ పీటర్స్బర్గ్, నిజ్నీ నొవ్గొరోడ్ ప్రాంతాలకు చెందినవారని పోలీసులు తెలిపారు.క్షతగాత్రుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఉజ్బెకిస్తాన్ ప్రాంతం నుంచి కార్మికులను తీసుకుని వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నంబర్ ప్లేట్ ఆధారంగా ఆ బస్సు కజికిస్తాన్లో రిజిస్టర్ అయిందని రష్యా న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







