సింగరేణి కార్మికులు ఉద్యోగం వద్దన్న వారికి రూ.25 లక్షలు: కేసీఆర్
- October 06, 2017
కార్మికులకు ఇచ్చిన హామీలను వంద శాతం నెరవేర్చుతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్ టీబీజీకేఎస్ విజయం సాధించడంతో సీఎం మీడియాతో మాట్లాడుతూ టీబీజీకేఎస్‌ను గెలిపించినందుకు కార్మికులకు కృతజ్ఞతలు చెప్పారు. కార్మికులకు అద్భుతమైన వెసులుబాటు కల్పించామని, చరిత్రలో ఇంతవరకు ఎవరూ చేయలేదని అన్నారు. ఉద్యోగాలు ఇప్పించేందుకు తప్పకుండా కారుణ్య నియామకం కింద పరిగణించి ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తామని అన్నారు. అలా కాని పక్షంలో రూ. 25 లక్షలు ఇస్తామని చెప్పామని, ఇచ్చిన హామీలన్నీ తూ.చ. తప్పకుండా నెరవేరుస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్నికలతో ప్రతిపక్ష నాయకులు బుద్ధి తెచ్చుకుని నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని కేసీఆర్ సూచించారు. వారు చేసిన వ్యాఖ్యలు ప్రజల దృష్టిలో జోకుల్లా ఉన్నాయని, ఎవరూ విశ్వసించడం లేదని ఎద్దేవా చేశారు.
రైతులకు పెట్టుబడి ఎప్పుడైనా ఇచ్చారా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. రైతులకు పెట్టుబడి ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. భూముల వివరాలు సేకరిస్తున్నా విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. భూరికార్డులు సరిచేస్తే స్థానిక సంస్థలు ఎందుకు నిర్వీర్యమవుతాయన్నారు. దీన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని వివరాలు సేకరిస్తుంటే భూరికార్డులపై ప్రతిపక్షాలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశాయని విమర్శించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించాలని గవర్నర్‌ను తానే కోరానని కేసీఆర్ తెలిపారు. ప్రతి అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని, రాజకీయాల్లో అసహనం పనికిరాదని ముఖ్యమంత్రి అన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







