పాకిస్తానీ ఇంజినీర్ ను కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డు
- October 06, 2017
దుబాయ్: పరాయి దేశంలో జీవిస్తున్నప్పుడు ఒకే దేశం వారు ఐక్యంగా ఉండటం సహజం. కానీ స్వదేశంకు చెందిన వ్యక్తిని డబ్బు కోసం కిడ్నప్ చేసిన ఉదంతం ఇది. జూన్ 20 న అల్ క్కుసైస్ లో జరిగిన సంఘటనలో 52 ఏళ్ల పాకిస్థానీ వ్యాపారి తన దేశానికి చెందిన ఇంజినీర్ స్నేహితుడిని బలవంతంగా అపహరించాడు. ఆ తర్వాత ఆ వ్యక్తిని అజ్మాన్ కు తీసుకెళ్లాక, కిడ్నప్ నుంచి విడిచిపెట్టాలంటే 5,400 ధిర్హాంలను ఇవ్వాలని డిమాండ్ చేశాడు. పాకిస్తాన్ ఇంజినీర్ కోర్టు లో మాట్లాడుతూ, "నేను మెట్రో స్టేషన్ వద్ద నుంచొని ఉన్నప్పుడు ఒక బస్సు వచ్చి నా ముందు ఆగింది కొంతమంది వ్యక్తులు మధ్యాహ్నం 2:30 గంటలకు ఒక్కసారిగా నాపై దాడి చేసి బలవంతాన బస్సులోకి ఎక్కించుకొని గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లారని " తెలిపాడు "వారు అజ్మాన్ లోని ఒక ఏకాంత ప్రదేశానికి నన్ను విడిచిపెట్టారు, అక్కడ వారు నాతో 5,400 ధిర్హాంలు చెల్లించమని ఆదేశాలు ఇచ్చారు, ఎవరినైనా పిలిపించి ఆ సొమ్ము మాకు ఇవ్వాలని బెదిరించారు. దానితో నేను నా స్నేహితుడిని పిలిపించి ఆ డబ్బు వారికి ఇప్పించానని పేర్కొన్నాడు ఒక పోలీసు లెఫ్టినెంట్ మాట్లాడుతూ, "బాధితుడైన ఇంజినీర్ ముఖంపై పిడి గుద్దులు కురిపించినట్లు ఆనవాళ్లు తలపై గాయాలు మరియు శరీరంపై కత్తితో గీసినట్లు చారలు కలిగి ఉన్నాడు,ఈ కేసుకి సంబంధించిన విచారణ అక్టోబర్ 26 వ తేదీకి వాయిదా పడింది.
తాజా వార్తలు
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..









