హీరో 'జై' కు నాన్ బెయిలబుల్ వారెంట్
- October 06, 2017
తమిళ హీరో జై చిక్కుల్లో పడ్డారు. చెన్నైలోని సైదాపేట్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ న్యాయస్థానం గురువారం ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మద్యం మత్తులో వాహనం నడిపిన కేసులో ఆయన గురువారం న్యాయమూర్తి ఎదుట హాజరుకావాల్సి ఉంది. అయితే జై రాకపోవడంతో తీవ్రంగా పరిగణించిన కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
సెప్టెంబరు 21న జై మద్యం మత్తులో కారు నడుపుతూ చెన్నైలోని ఆడ్యార్ ఫ్లై ఓవర్‌ను ఢీ కొట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయన్ని అరెస్టు చేయగా, బెయిలుపై విడుదలయ్యారు. డ్రైవింగ్ లైసెన్సును రద్దు చేసుకోవాలని... లేదంటే అక్టోబరు 5న కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుందని పోలీసులు ఆయనకు సూచించారు. కానీ జై కోర్టు ముందు హాజరు కాలేదు.
'జర్నీ', 'రాజా రాణి' చిత్రాలతో జై తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. జై, అంజలి జంటగా నటించిన 'బెలూన్' చిత్రాన్ని ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు ఫస్ట్‌లుక్‌ను గురువారం విడుదల చేశారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..









