'అదిరింది'కి అరుదైన గౌవరం.!
- October 06, 2017
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న 61వ ప్రతిష్టాత్మక చిత్రం అదిరింది. ఈ చిత్రం టీజర్ కు 1.5 మిలియన్ వ్యూస్ తో తెలుగు స్టార్ హీరోల చిత్రాలకు ధీటుగా వ్యూస్ రావడంతో ఆయన తెలుగు అభిమానులు ఫుల్ ఖుషీ గా వున్నారు. ఈ సినిమాతో తెలుగు లో విజయ్ తన సత్తా చూపించబోతున్నాడు. దాదాపు 100 కోట్లతో నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు తమిళ భాషల్లో గ్రాండ్ గా రిలీస్ చేయనున్నారు. ఇక తాజాగా ఈ చిత్రానికి అరుదైన గౌరవం లభించింది. ప్రపంచ ప్రఖ్యాత లీ గ్రాండ్ రెక్స్ థియేటర్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు. పారీస్ లో ఉన్న ఈ థియేటర్ లో ఇప్పటివరుకు దకిణ భారతదేశం నుంచి బాహుబలి 2, కబాలి చిత్రాలు మాత్రమే ప్రదర్శింపబడ్డాయి. వాటి తరువాత మళ్లీ విజయ్ అదిరిందికి మాత్రమే ఈ అరుదైన గౌరవం లభించినట్లుగా చిత్ర బృందం తెలిపింది. అలానే పారీస్ తో పాటు యూఎస్ ఏ, లండన్, దుబాయ్, కెనాడా, మలేషియా తదితర దేశాల్లో అదిరింది భారీ స్థాయిలో విడుదల అవుతోంది. అక్టోబర్ 18న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల అవుతోంది.
తాజా వార్తలు
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..









