రికార్డ్ సాధించేందుకు 1300 మంది మలయాళీ మహిళలతో యూఏఈ లో కేరళ సాంప్రదాయ నృత్య ప్రదర్శన
- October 07, 2017
దుబాయ్ : ఈ నెల 27 వ తేదీన 1300 మంది మలయాళీ మహిళలతో యూఏఈ లో కేరళ సాంప్రదాయ నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారు. దుబాయ్ లో నివసిస్తున్న కేరళీయులు అక్కడ అరుదైన రికార్డ్ కోసం ప్రయత్నిస్తున్నారు. వయోబేధం లేకుండా అన్ని వయసుల స్త్రీలు భారీ నృత్య ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 27న జరగనున్న ఓ కార్యక్రమంలో దాదాపు 1300 మంది మలయాళీ మహిళలు ఒకేసారి ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం మలయాళీ మహిళలంతా 40 గ్రూపులుగా ఏర్పడి వివిధ ప్రాంతాల్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. స్కూల్ విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు ఈ ప్రదర్శన కోసం సిద్ధమవుతున్నారు. ప్రముఖ మలయాళ నటి ఆశా శరత్ నృత్య దర్శకత్వంలో కేరళ సాంప్రదాయ నృత్యం కైకొట్టైకలిని 15 నిమిషాల 30 సెకన్ల సుధీర్ఘ ప్రదర్శన ఇవ్వనున్నారు. కేరళలో నిర్వహించే త్రిసూర్ పోరం తరహాలో దుబాయ్ లో నిర్వహిస్తున్న పోరమ్ దుబాయ్ లో భాగంగా ఈ ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో దుబాయ్, అబుదాబి, అజ్మాన్, అల్ ఐన్ ప్రాంతాల్లో నివసిస్తున్న మలయాళీలు పాల్గొననున్నారు. తిరువథిరకలి అని కూడా పిలుచుకునే ఈ సాంప్రదాయ నృత్య ప్రదర్శనతో భారత్ వెలుపల అది ఎక్కువ మంది ప్రదర్శించిన రికార్డ్ ను సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







