బంగ్లాదేశ్‌ పారిపోతున్నరోహింగ్యాల పడవ మునక: 12మంది మృతి

- October 08, 2017 , by Maagulf
బంగ్లాదేశ్‌ పారిపోతున్నరోహింగ్యాల పడవ మునక: 12మంది మృతి

మయన్మార్‌ సైనికుల హింసాకాండను భరించలేక వేల సంఖ్యలో రోహింగ్యాలు బంగ్లాదేశ్‌ పారిపోతున్న విషయం తెలిసిందే. అయితే ఇలా పారిపోయే క్రమంలో ప్రమాదకరంగా నదిని దాటుతూ అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మొన్నటికి మొన్న బంగ్లాదేశ్‌ తీరానికి సమీపంలో ఓ పడవ బోల్తా పడి 19 మంది రోహింగ్యాలు మరణించగా.. తాజాగా మరో ప్రమాదం చోటుచేసుకుంది. నాఫ్‌ నదిలో పడవ మునిగి 12 మంది మృతిచెందారు. పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. 
మయన్మార్‌లోని రఖైన్‌ ప్రాంతం నుంచి రోహింగ్యాలతో బయల్దేరిన పడవ బంగ్లాదేశ్‌లోని గలాచర్‌ ప్రాంతంలో ప్రమాదవశాత్తు మునిగిపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 12 మంది మృతిచెందగా.. పలువురు గల్లంతయ్యారు. ప్రమాదం సమయంలో పడవలో 100 మంది ఉన్నట్లు తెలుస్తోంది. సామర్థ్యానికి మించి ప్రయాణించడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు సహాయకచర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఇద్దరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. 
ఇప్పటికే బంగ్లాదేశ్‌లోని 23చోట్ల దాదాపు ఐదు లక్షల మంది రోహింగ్యా శరణార్థులు శిబిరాల్లో తలదాచుకున్నారు. మయన్మార్‌లోని రఖైన్‌ రాష్ట్రం నుంచి వీరంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నదిని దాటుకుంటూ బంగ్లా చేరుతున్నారు. వీరందరినీ కాక్స్‌బజార్‌కు తరలించి అక్కడ మూడు వేల ఏకరాల్లో ఒక్కచోటే ఎనిమిది లక్షల మందికి ఆశ్రయం కల్పించేలా బంగ్లా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com