దుబాయ్‌ రోడ్లపై కొత్త స్పీడ్‌ లిమిట్స్‌

- October 09, 2017 , by Maagulf
దుబాయ్‌ రోడ్లపై కొత్త స్పీడ్‌ లిమిట్స్‌

దుబాయ్‌ రెసిడెంట్స్‌ ఇకపై తమ వాహనాలు నడిపేటప్పుడు స్పీడ్‌ లిమిట్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అక్టోబర్‌ 15 నుంచి స్పీడ్‌ లిమిట్‌ని గంటకు 120 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుఉంది రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ అలాగే దుబాయ్‌ పోలీస్‌ జనరల్‌ హెడ్‌ క్వార్టర్స్‌. రోడ్డు ప్రమాదాల్ని తగ్గించేందుకే ఈ చర్యలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. ఇంతకు ముందు 141 కిలోమీటర్లకు రాడార్స్‌ని సెట్‌ చేయగా, ఇప్పుడు దాని పరిమితిని 131 కిలోమీటర్లకు తగ్గించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని ఆర్‌టిఎ ట్రాఫిక్‌ అండ్‌ రోడ్స్‌ ఏజెన్సీ - ఆర్‌టిఎ సిఇఓ ఇంజనీర్‌ మైతా బిన్‌ అదాయ్‌ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com