విమానాలను గంట పాటు నిలిపేసిన కుక్క!

- October 09, 2017 , by Maagulf
విమానాలను గంట పాటు నిలిపేసిన కుక్క!

ఓ చిన్న కుక్కపిల్ల కారణంగా 14 విమానాలు నిలిచిపోయాయి. జపాన్‌ రాజధాని టోక్యోలోని హనెడా ఎయిర్‌పోర్ట్‌లో చోటుచేసుకుంది ఈ ఘటన. ఓ రన్‌వేపై కుక్కపిల్ల హల్‌చల్‌ సృష్టించింది. ఈ సమయంలో విమానాలు టేకాఫ్‌ అవడం ప్రమాదమని భావించిన ఎయిర్‌పోర్ట్‌ అధికారులు దాదాపు ఆరు నిమిషాల పాటు నాలుగు రన్‌వేలను మూసివేశారు. సోమవారం జపాన్‌ ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఓ విమానం హనెడా నుంచి నహాకి మరికొద్ది సేపట్లో  బయలుదేరుతుందనగా ఓ కుక్కపిల్ల రన్‌వేపై పరుగులు పెడుతూ హడావుడి చేసింది. దాంతో 14 విమానాలు గంట పాటు నిలిచిపోయాయి. ఆ తర్వాత కుక్కపిల్ల యజమాని వచ్చి 40 నిమిషాల పాటు శ్రమించి దానిని అదుపులోకి తీసుకున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com