ఉత్తరకొరియాతో యుద్ధం: అమెరికాకి తోడుగా బ్రిటన్
- October 09, 2017
ఉత్తరకొరియా, అమెరికాల మధ్య వార్ టెన్షన్స్ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా మిత్ర దేశమైన బ్రిటన్ కూడా యుద్ధానికి సిద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన యుద్ధ సామగ్రిని కూడా సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ల మాటల యుద్ధానికి తెరపడడం లేదు. దీంతో ఇరు దేశాల నడుమ యుద్ధం తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఒకవేళ ఉత్తరకొరియా.. అమెరికాతో గనుక తలపడితే.. ఇరువైపులా ఉన్న మిత్రదేశాలు చూస్తూ ఊరుకోవు. యుద్ధంలోకి అవి దిగక తప్పదు. ఈ నేపథ్యంలో బ్రిటన్ ముందు జాగ్రత్త చర్యగా తన ఆయుధ సామగ్రిని సిద్ధం చేసుకుంటోంది.
బ్రిటన్ తన సరికొత్త విమాన వాహక నౌక హెచ్ఎంఎస్ క్వీన్ ఎలిజబెత్ ను రంగంలోకి దించనుంది. తమ వద్ద టైప్ 45 డెస్ట్రాయర్లు, టైప్ 23 ఫ్రిగేట్స్ ఉన్నప్పటికీ.. అవసరమైతే విమాన వాహక నౌక క్వీన్ ఎలిజబెత్ ను కూడా రంగంలోకి దించుతామని ఆ దేశ మిలటరీ అధికారి ఒకరు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







