కాంచీపురంలో రష్యా దేశానికీ చెందిన బిచ్చగాడు
- October 10, 2017
కాలం కలసిరాకపోతే దేశం కాని దేశంలో బిచ్చమెత్తుకోవాల్సి వస్తుంది. రష్యాకు చెందిన 24 ఏళ్ల ఇవాంజెలిన్ పర్యాటకుడిగా మన దేశం వచ్చాడు. కాంచీపురం గురించి తెలుసుకుని అనేక గుళ్లుగోపురాలు తిరిగాడు. సాంకేతిక కారణాల వల్ల అతని ఏటీఎం కార్డు పిన్‌ను రష్యా స్తంభింపజేసింది. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఆకలి తీర్చుకోవడానికి కాంచీపురంలోని కుమారకొట్టం శ్రీసుబ్రహ్మణ్యస్వామి దేవాలయం మెట్లపై కూర్చుని బిచ్చమెత్తుకుంటున్నాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు అతనికి కొంత ధనసహాయం చేశారు. చెన్నై వెళ్లి రష్యా రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. మరోవైపు మన దేశ విదేశీవ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ కూడా స్పందించారు. ఏటీఎం పిన్ పనిచేసేలా రష్యా అధికారులతో మాట్లాడతానని ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







