హైదరాబాద్ శంషాబాద్‌లో క్యాబ్ డ్రైవర్ల ఆందోళన

- October 11, 2017 , by Maagulf
హైదరాబాద్ శంషాబాద్‌లో క్యాబ్ డ్రైవర్ల ఆందోళన

ఓలా, ఉబర్ సంస్థలను నిషేధించి తమను ఆదుకోవాలంటూ.. క్యాబ్‌ డ్రైవర్లు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ దగ్గర ఆందోళనకు దిగారు. మోకాళ్లపై నడుస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. డ్రైవర్ల ఆందోళనలతో ఎయిర్‌పోర్ట్ దగ్గర ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు. 

ఎన్నో ఆశలు కల్పించి.. తమతో కార్లు కొనిపించిన క్యాబ్ కంపెనీలు.. ఇప్పుడు ట్రిప్పులను సక్రమంగా కేటాయించలేదంటూ ఆరోపించారు డ్రైవర్లు. ఫైనాన్స్ డబ్బులు కట్టలేక.. కుటుంబాన్ని పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ రూపొందించి తమకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం క్యాబ్ కంపెనీలు కేవలం 5 శాతం మాత్రమే ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తున్నాయని.. యాప్‌ రూపొందిస్తే.. తాము పది శాతం పన్ను కడతామంటూ చెప్పారు డ్రైవర్లు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com