ఎన్‌ఓఎల్ కార్డులు వినియోగిస్తే ఉచిత కూపన్స్
- October 11, 2017
రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ), లాయల్టీ పాయింట్స్ ప్రోగ్రామ్ని ఎన్‌ఓఎల్ కార్డుల కోసం ప్రారంభించనుంది. ఎన్‌ఓఎల్ ప్లస్ ప్రోగ్రామ్, ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రానుంది. ఎన్‌ఓఎల్ కార్డుదారులు పాజిటివ్ పాయింట్స్‌ని రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ పాయింట్లు, కూపన్లు మరియు ఓచర్లుగా మార్చుకునేందుకు వీలుంది. కేఫ్‌లు, రెస్టారెంట్లు, ఎంటర్టైన్మెంట్ సెటర్లలో వీటి ద్వారా ఫ్రీ సర్వీసెస్ పొందవచ్చు. ఆర్టిఎ కార్పొరేట్ టెక్నాలసీ సపోర్ట్ సర్వీసెస్ సెక్టార్ - ఆటోమేటెడ్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్స్ డైరెక్టర్ ఖాలిద్ అల్ అవధి మాట్లాడుతూ, ఈ ఏడాది చివరి నుంచి ఈ ప్రోగ్రామ్ అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పారు. తొలిసారిగా ఎన్‌ఓఎల్ కార్డుదారులు లాయల్టీ పాయింట్స్ పొందేందుకు వీలుంటుందని వివరించారాయన. మెట్రో, పబ్లిక్ బస్‌లు, ట్రామ్, మెరైన్ట్రాన్స్పోర్ట్ విభాగాల్ని, అలాగే పార్కింగ్ పేమెంట్ చేసేవారికి, ఎతిహాద్ మ్యూజియం, పబ్లిక్ పార్కుల్లో ఎన్‌ఓఎల్ కార్డులు వినియోగించేవారికి లాయల్టీ పాయింట్లు లభిస్తాయి. వాటిని కూన్లుగా మలచుకుని ఫుడ్, ఎంటర్టైన్మెంట్ జోన్లలో వినియోగించుకోవచ్చు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్‌కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







