పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్‌కు నాన్‌బెయిలబుల్ అరెస్టు వారెంట్
- October 12, 2017
పాకిస్థాన్ మాజీ క్రికెటర్, పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్‌కు ఇవాళ ఆ దేశ ఎన్నికల సంఘం నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో ఎన్నికల సంఘం ఈ ఆదేశాలు ఇచ్చింది. పెండింగ్ కేసులో ఇమ్రాన్ ఖాన్ వరుసగా కోర్టుకు హాజరుకావడం లేదు. కోర్టుకు రాలేకపోతున్నట్లు కూడా ఇమ్రాన్ రాతపూర్వక క్షమాపణ ఇప్పటి వరకు ఇవ్వలేదు. దీంతో ఈ కేసులో ఇవాళ ఎన్నికల సంఘం ఇమ్రాన్‌కు నాన్‌బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈనెల 26వ తేదీన జరగనున్న విచారణకు ఇమ్రాన్‌ను పట్టుకు రావాలని కోర్టు ఆదేశించింది. పార్టీ వ్యవస్థాపక సభ్యుడు అక్బర్ వేసిన కేసులో ఇమ్రాన్‌పై ఈ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సంఘం అక్రమాలకు పాల్పడినట్లు గతంలో ఇమ్రాన్ ఆరోపణలు చేశారు. ఆ కేసులోనే ఈ విచారణ కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్‌లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!









