'మాంజ' పాటల విడుదల కార్యక్రమం

- November 03, 2015 , by Maagulf
'మాంజ' పాటల విడుదల కార్యక్రమం

'మాంజ' పాటలొచ్చాయిచిన్న వయసులోనే 'ఫుట్‌పాత్‌' అనే చిత్రాన్ని తెరకెక్కించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో మొత్తం 11 పురస్కారాల్ని అందుకొన్నాడు కిషన్‌.ఎస్‌.ఎస్‌. తాజాగా ఆయన కథానాయకుడుగా నటిస్తూ స్వీయదర్శకత్వంలో 'మాంజ' చిత్రాన్ని తెరకెక్కించాడు. అవికాగోర్‌ కీలక పాత్రధారి. గిరిధర్‌ మామిడిపల్లి, పద్మజ మామిడి పల్లి నిర్మాతలు. వివేక్‌ కర్‌, మనోజ్‌ శ్రీహరి, కిషన్‌.ఎస్‌.ఎస్‌. సంగీతం సమకూర్చారు. హైదరాబాద్‌లో పాటల విడుదల కార్యక్రమం జరిగింది. తొలి సీడీని తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. దామోదర్‌ ప్రసాద్‌ స్వీకరించారు. ప్రచార చిత్రాలను ఎన్‌.శంకర్‌, రఘుకుంచె, సురేష్‌ కొండేటి విడుదల చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ''కిషన్‌ త్వరలోనే ఓ అంతర్జాతీయ ప్రాజెక్టుని చేపట్టనున్నాడు. తను తీసిన 'మాంజ' ప్రచార చిత్రం, పాటలు బాగున్నాయి'' అన్నారు. కిషన్‌.ఎస్‌.ఎస్‌. మాట్లాడుతూ ''తెలిసీ తెలియని వయసులో అపరాధాలు చేసే వారి భావోద్వేగాలు, వీరి పట్ల చట్టం, సమాజం ధోరణి ఎలా ఉందన్న విషయాల్ని ప్రస్తావిస్తూ ఆసక్తికరంగా చిత్రాన్ని తీర్చిదిద్దాం. నేపథ్య సంగీతానికి ప్రాధాన్యముంది. ఈ సినిమా ఈ నెల 6న లాస్‌ ఏంజిలెస్‌్‌లో అకాడెమీ అవార్డ్సు కమిటీ ముందు ప్రదర్శితం కానుంది. అవికా తన పాత్రలో ఒదిగిపోయింద''న్నారు. ఇలాంటి ప్రయోజనాత్మక సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉందని చెప్పింది అవికా గోర్‌. తెలుగు, కన్నడ, హిందీల్లో ఈ నెల చివర్లో విడుదలవుతుందని గిరిధర్‌ చెప్పారు. కార్యక్రమంలో బాబా సెహగల్‌, ప్రసన్నకుమార్‌, రాజ్‌ కందుకూరి, ప్రతాని రామకృష్ణగౌడ్‌, వీరశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com