ఫ్యూయల్ స్టేషన్ సిబ్బంది నిర్వాకం: వాహనాల డ్యామేజీ
- October 12, 2017
మనామా: ఫ్యూయల్ స్టేషన్ సిబ్బంది పొరపాటుతో, పలు వాహనాలు డ్యామేజీకి గురయ్యాయి. ముహరాక్ గవర్నరేట్ పరిధిలోని ఓ ముఖ్యమైన ఫ్యూయల్ స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. బహ్రెయిన్ పెట్రోలియం కంపెనీ (బాప్కో) - హిద్ కన్య్సుమర్ కోఆపరేటివ్ అసోసియేషన్ నిర్వహిస్తోన్న ఫ్యూయల్ స్టేషన్లో 91 ఆక్టేన్ జయ్యిద్ ఫ్యూయల్ ఫిల్ చేయాల్సి ఉండగా, ఆ వాహనాల్ని డీజిల్‌తో నింపివేశాడు. ఈ కారణంగా ఐదు వాహనాలు డ్యామేజ్ అయ్యాయి. ఈ క్రమంలో ముగ్గురు డ్రైవర్లు పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బాప్కో సంస్థకీ సమాచారం అందించారు. దాంతో బాప్కో సంస్థ అవసరమైన చర్యలు చేపట్టింది. ఫ్యూయల్ స్టేషన్లో డీజిల్ మిక్స్ అయినందున తాత్కాలికంగా సేవల్ని రద్దు చేస్తున్నట్లు ఆ స్టేషన్ నిర్వాహకులు పేర్కొన్నారు. జరిగిన పొరపాటుకు చింతిస్తున్నామనీ ఇకపై ఎలాంటి పొరపాట్లు జరగవని నిర్వాహకులు తెలియజేశారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్‌లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







