ఫ్యూయల్‌ స్టేషన్‌ సిబ్బంది నిర్వాకం: వాహనాల డ్యామేజీ

- October 12, 2017 , by Maagulf
ఫ్యూయల్‌ స్టేషన్‌ సిబ్బంది నిర్వాకం: వాహనాల డ్యామేజీ

మనామా: ఫ్యూయల్‌ స్టేషన్‌ సిబ్బంది పొరపాటుతో, పలు వాహనాలు డ్యామేజీకి గురయ్యాయి. ముహరాక్‌ గవర్నరేట్‌ పరిధిలోని ఓ ముఖ్యమైన ఫ్యూయల్‌ స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బహ్రెయిన్‌ పెట్రోలియం కంపెనీ (బాప్కో) - హిద్‌ కన్య్సుమర్‌ కోఆపరేటివ్‌ అసోసియేషన్‌ నిర్వహిస్తోన్న ఫ్యూయల్‌ స్టేషన్‌లో 91 ఆక్టేన్‌ జయ్యిద్‌ ఫ్యూయల్‌ ఫిల్‌ చేయాల్సి ఉండగా, ఆ వాహనాల్ని డీజిల్‌తో నింపివేశాడు. ఈ కారణంగా ఐదు వాహనాలు డ్యామేజ్‌ అయ్యాయి. ఈ క్రమంలో ముగ్గురు డ్రైవర్లు పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బాప్కో సంస్థకీ సమాచారం అందించారు. దాంతో బాప్కో సంస్థ అవసరమైన చర్యలు చేపట్టింది. ఫ్యూయల్‌ స్టేషన్‌లో డీజిల్‌ మిక్స్‌ అయినందున తాత్కాలికంగా సేవల్ని రద్దు చేస్తున్నట్లు ఆ స్టేషన్‌ నిర్వాహకులు పేర్కొన్నారు. జరిగిన పొరపాటుకు చింతిస్తున్నామనీ ఇకపై ఎలాంటి పొరపాట్లు జరగవని నిర్వాహకులు తెలియజేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com