స్పీడ్‌ లిమిట్స్‌ పాటిస్తే రివార్డులు

- October 12, 2017 , by Maagulf
స్పీడ్‌ లిమిట్స్‌ పాటిస్తే రివార్డులు

దుబాయ్‌: మోటరిస్టులు స్పీడ్‌ లిమిట్స్‌ని ఫాలో అయ్యేలా చేయడం కోసం దుబాయ్‌ పోలీసులు రివార్డ్‌ పాయింట్ల విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ రివార్డు పాయింట్లను వోచర్లు, గిఫ్టుల రూపంలో రిడీమ్‌ చేసుకునే అవకాశం ఉంది. దుబాయ్‌ పోలీస్‌ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ మేజర్‌ జనరల్‌ అబ్దుల్లా ఖలీఫా అల్‌ మెర్రి మాట్లాడుతూ, స్పీడ్‌ లిమిట్స్‌ దాటకుండా డ్రైవర్లు వాహనాలు నడిపితే, వారికి రివార్డ్‌ పాయింట్స్‌ ద్వారా ప్రోత్సాహకాలు అందించాలన్న ఈ మంచి ఉద్దేశ్యం విజయవంతమవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. జిటెక్స్‌ టెక్నాలజీ వీక్‌లో ఈ ప్రోగ్రామ్‌ని ప్రారంభిస్తారు. దుబాయ్‌ పోలీస్‌ యాప్‌లోకి లాగిన్‌ అయ్యి, రిజిస్టర్‌ చేసుకోవచ్చని అధికారులు లెతిపారు. పరిమిత దూరానికిగాను తగిన వేగంతో ప్రయాణించే వాహనాలకు రివార్డ్‌ పాయింట్స్‌ లభిస్తాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com