కార్‌ డ్రిఫ్టింగ్‌: సోహార్‌లో ఒకరి అరెస్ట్‌

- October 14, 2017 , by Maagulf
కార్‌ డ్రిఫ్టింగ్‌: సోహార్‌లో ఒకరి అరెస్ట్‌

మస్కట్‌: నార్త్‌ అల్‌ బతినాలో పోలీసులు, ఓ వ్యక్తిని కార్‌ డ్రిఫ్టింగ్‌ ద్వారా ఇతరులకు ఇబ్బందికరమైన రీతిలో వ్యవహరిస్తున్నందుకుగాను అరెస్ట్‌ చేశారు. సోహార్‌లోని కువైరియాలో ఈ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రాయల్‌ ఒమన్‌ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, నిందితుడిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోన్నుట్లు తెలియవస్తోంది. నిందితుడు ఉల్లంఘించిన నిబంధన శిక్షార్హమని తెలిపారు పోలీసులు. ఈ తరహా ఘటనలు చోటుచేసుకుంటే వెంటనే ఫిర్యాదు చేయాల్సిందిగా పోలీసులు పౌరులకు విజ్ఞప్తి చేశారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com