జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేసిన సిట్ అధికారులు
- October 14, 2017
జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ కీలక పురోగతి సాధించింది. ఆమెను హత్య చేసిన ముగ్గురు నిందితులను గుర్తించింది. ఒక సీసీ టీవీ ఫుటేజ్ విడుదల చేసింది. ఆ దృశ్యాలను టీవీ 5 ఎక్స్ క్లూజివ్‌గా సంపాదించింది. ముగ్గురు నిందితుల ఊహా చిత్రాలు రూపొందించి విడుదల చేసింది. నిందితులను గుర్తించడంలో ప్రజలు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. నిందితులను త్వరగా పట్టుకోవాలంటూ నిరసనలు వెల్లువెత్తుతుండడంతో సిట్ దీనిపై ముమ్మరంగా దర్యాప్తు జరుపుతోంది.
సెప్టెంబర్ 5న కారులో ఇంటికొచ్చిన గౌరీ లంకేష్.. మెయిన్ గేటు తీస్తుండగా దుండగులు ఆమెపై దగ్గర్నుంచి కాల్పులు జరిపారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో స్పష్టంగా రికార్డయ్యాయి. అప్పటికే కాపుకాసిన దుండగులు.. కాల్పులు జరిపిన తర్వాత బైక్ పై పారిపోయారు. దుండగులు పక్కా రెక్కీ నిర్వహించే ఈ హత్య చేసినట్టు ఈ ఫుటేజ్ స్పష్టం చేస్తోంది.
సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుల కోసం వేట ప్రారంభించారు. హంతకుల ఆచూకీ తెలిపినవారికి పది లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించారు. గౌరీ లంకేష్ హత్యను రాజకీయ పార్టీల నేతలు, మేధావులు ఖండించారు. గౌరీ లంకేష్ హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా జర్నలిస్ట్ సంఘాలు ఆందోళనలకు దిగాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశాయి.
తాజా వార్తలు
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం







