బ్రేవ్‌ కంబాట్‌: మూడు టైటిల్స్‌ కోసం పోరు

- October 14, 2017 , by Maagulf
బ్రేవ్‌ కంబాట్‌: మూడు టైటిల్స్‌ కోసం పోరు

మనామా: బ్రేవ్‌ కంబాట్‌ ఫెడరేషన్‌, మూడు మేజర్‌ చాంపియన్‌ షిప్‌ టైటిల్స్‌ని ఖరారు చేసింది. తొమ్మిదవ ఎడిషన్‌ బ్రేవ్‌ షెడ్యూల్‌కి సంబంధించి ఈ పోటీలు జరుగుతాయి. మిడిల్‌ ఈస్ట్‌ యూరోప్‌ మరియు ఆఫ్రికాలో ఇదే బిగ్గెస్ట్‌ ఫైట్‌గా అభివర్ణిస్తున్నారు. నవంబర్‌ 17న ఖలీఫా స్పోర్ట్స్‌ సిటీ ఏరీనా - మనామా, బహ్రెయిన్‌లో ఈ పోటీలు జరుగుతాయి. మూడు ముఖ్యమైన టైటిల్‌ ఫైట్స్‌ ఇక్కడ ప్రధాన ఆకర్షణ కానున్నాయి. మొరాకో నుంచి ఓట్‌మాన్‌ అజియాతార్‌, మెక్సికో నుంచి అలెజాండ్రో మార్టినెజ్‌ మధ్య ఓ పోరు జరుగుతుంది. ఫస్ట్‌ ఎవర్‌ ఫెదర్‌ వెయిట్‌ ఛాంపియన్‌ ఎలియాస్‌ బౌడెజ్‌డామ్‌ - బ్రెజిల్‌కి చెందిన లూకాస్‌ మార్టిన్స్‌తో తలపడ్తాడు. బాంటమ్‌వెయిట్‌ ఛాంపియన్‌షిప్‌ స్టిఫెన్‌ లోమాన్‌ మరియు గుర్‌దర్శన్‌ మంగత్‌ మధ్య మరో పోరు జరుగుతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com