వాణి విశ్వనాథ్ ని టార్గెట్ చేసిన రామ్ గోపాల్ వర్మ

- October 14, 2017 , by Maagulf
వాణి విశ్వనాథ్ ని టార్గెట్ చేసిన రామ్ గోపాల్ వర్మ

వివాదాల వర్మ ఎన్టీఆర్ బయో పిక్ ని తెరకెక్కిస్తా అని ప్రకటించినప్పటి నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రకటించినప్పటి నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా సీనియర్ హీరోయిన్ వాణి విశ్వనాథ్ ఈ సినిమాపై తన అభిప్రాయం ని చెప్పింది... తెలుగు ప్రేక్షకులకు మీకు దేవుడు లాంటి నటుడు ఎవరు? అని అడిగితే వెంటనే ఠక్కున ఎన్టీఆర్ అని చెబుతారు. అటువంటి ఎన్టీఆర్ జీవిత చరిత్ర పై ఆయన తనయుడు బాలకృష్ణ సినిమా తెరకెక్కించనున్నారు.. అది చాలా గొప్ప సినిమా అవుతుంది. కానీ రామ్ గోపాల్ వర్మ తీయాలని భావిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ పై చాలా అనుమానాలు ఉన్నాయి.. రాముడి సినిమా తీస్తూ... రావణ పేరు పెట్టలేదు కదా..! అని అంటూనే ఎన్టీఆర్ బయోపిక్ పై సినిమా ప్రయత్నం ను వర్మ మానేస్తే మంచిది అని వాణి విశ్వనాథ్ అన్నారు.. అంతేకాదు.. ఎన్టీఆర్ కు కళంకం తెచ్చేలా సినిమా తీస్తే ఆయన ఇంటి ముందు ధర్నాకు దిగుతా.. అని త్వరలోనే టీడీపీ తీర్ధం పుచ్చుకొనున్న వాణి విశ్వనాథ్ హెచ్చరించింది. ఎవరైనా ఏదైనా అంటే.. ఒకటికి రెండు బదులు ఇచ్చే వర్మ.. వాణి విశ్వనాథ్ హెచ్చరికకు వెంటనే స్పందించాడు.. తన ఇంటి ముందు ధర్నా చేస్తా అన్న వాణివిశ్వనాథ్ కు కౌంటర్ ఇచ్చాడు.. అసలు తనకు ఇల్లే లేదని.. ఇక ఏ విధంగా ఇంటి ముందు ధర్నా చేస్తావు... నేను రోడ్లపై తిరుగుతూ ఉంటా... నన్ను వెతుక్కుంటూ రోడ్లపైకి వస్తే.. వాణి విశ్వనాథ్ పాదాలు కమిలిపోతాయంటూ సెటైర్ వేశాడు.   

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com