ఇరాక్‌, ఖుర్ధు దళాల మధ్య ఘర్షణ

- October 14, 2017 , by Maagulf
ఇరాక్‌, ఖుర్ధు దళాల మధ్య ఘర్షణ

మర్యం బెయిక్‌: ఇరాక్‌లో చమురు నిల్వలు అధికంగా ఉన్న వివాదస్పద కిర్కుక్‌ ప్రాంతంలో ఇరాకీ, ఖర్దు దళాల మధ్య ఘర్షణ నెలకొంది. ఆయుధాలు ధరించి నదికి ఇరువైపులా దళాలు మోహరించాయి. ఇస్లామిక్‌ స్టేట్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఈ రెండు దళాలు, ఇలా కయ్యానికి దిగడం సరికాదని అమెరికా హితవు పలికింది. సెప్టెంబరు 25న జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ఖుర్దులకు స్వాతంత్య్రం ఇవ్వాలన్న ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణ చట్ట విరుద్ధమని ఇరాక్‌ ప్రభుత్వం వాదిస్తోంది. ఖుర్దు దళాలు లొంగిపోవాలని ఆదేశించింది. దీనిపై వివాదం ముదరడంతో ఘర్షణ తలెత్తింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com