పాక్‌తో సరికొత్త బంధం
- October 15, 2017
వాషింగ్టన్: గత కొన్నేళ్లుగా పాకిస్తాన్.. అమెరికా నుంచి అమితమైన లబ్ధి పొందిందని, అయితే ప్రస్తుతం ఇరు దేశాలు తమ మధ్య సంబంధాలను సరికొత్తగా ప్రారంభిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. పాకిస్తానీ సేనలు హక్కానీ ఉగ్రవాద సంస్థ చెర నుంచి అమెరికన్–కెనెడియన్ కుటుంబాన్ని విడిపించిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అమెరికా నిఘా వర్గాలు అందించిన సమాచారంతో గురువారం పాకిస్తానీ సేనలు హక్కానీల నుంచి అమెరికా జాతీయురాలు కైతలాన్ కోలేమాన్, ఆమె భర్త జాషువా బోయ్లే, వారి ముగ్గురు పిల్లలను రక్షించాయి. 2012లో అఫ్గానిస్తాన్‌లో ఈ జంటను హక్కానీలు కిడ్నాప్ చేశారు. బందీలుగా ఉన్న సమయంలోనే వీరికి ముగ్గురు పిల్లలు జన్మించారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ సాయం అందించడాన్ని గత ఆగస్టులో ట్రంప్ తప్పుపట్టారు.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







