అజయ్ 'స్పెషల్‌'.!

- October 15, 2017 , by Maagulf
అజయ్ 'స్పెషల్‌'.!

అ జయ్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం 'స్పెషల్‌'. ది స్టోరీ ఆఫ్‌ ఎ మైండ్‌ రీడర్‌... అనేది ఉపశీర్షిక. రంగ, అక్షత, సంతోష నాయకానాయికలు. వాస్తవ్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. శనివారం కూకట్‌పల్లి సమీపంలోని పదహారంతస్తుల భవంతిపై యాక్షన్‌ దృశ్యాలను చిత్రీకంచారు. ఈ సందర్భంగా చిత్రబృందం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసింది. దర్శకనిర్మాత మాట్లాడుతూ ''ప్రేమ, పగ నేపథ్యంలో సాగే సైకలాజికల్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. కథ, కథనాలు ప్రత్యేకంగా ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే 'స్పెషల్‌' అనే పేరుని ఖరారు చేశాం. డేవిడ్‌ ముఖాన్‌తో పాటు, రెండో ప్రపంచ యుద్ధం సమయంలో వార్నర్‌ రాసిన పుస్తకాల్లోని అంశాలను ప్రేరణగా తీసుకుని ఈ కథని తయారు చేశా. డిసెంబర్‌కల్లా చిత్రాన్ని సిద్ధం చేస్తామ''న్నారు. అజయ్‌ మాట్లాడుతూ ''కథలో కొత్తదనం ఉంది. దర్శకుడు ఆసక్తికరంగా చిత్రీకస్తున్నారు. కేసుని పరిశోధించే ఓ పోలీసు అధికారి పాత్రలో నటిస్తున్నా'' అన్నారు. అశోక్‌ కుమార్‌, అమర్‌ కుమార్‌, ఎన్వీయస్‌ మణ్యం పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com