సౌదీలో మహిళలు కారు డ్రైవింగ్ చేస్తే సహించని పురుషాహంకారులు

- October 15, 2017 , by Maagulf
సౌదీలో  మహిళలు కారు డ్రైవింగ్ చేస్తే సహించని పురుషాహంకారులు

సౌదీఅరేబియా: ' రాజు వరమిచ్చినా....చాంధసవాదులు  మహిళలు కారు నడిపేందుకు ససమేరా ఒప్పుకోవడం లేదు. వారి కార్లకు అడ్డం పడి అసహ్యకరమైన మాటలతో కొందరు స్త్రీలను బాధిస్తున్నారు.  కారు డ్రైవింగ్ చేసుకునే అవకాశం కల్పిస్తూ సౌదీ ప్రభుత్వం ఇటీవల చారిత్రక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం కొంతమంది పురుషాహంకారులకు మింగుడు పడటం లేదు. వారు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆడవాళ్లు ఒంటరిగా కార్లు నడపకూడదంటూ ఏకంగా వారి వాహనాలకు అడ్డం పడిపోతున్నారు. తాజాగా సౌదీలో జరిగిన ఒక సంఘటన వైరల్‌గా మారింది. సౌదీలో ఒక మహిళ ఒంటరిగా కారు డ్రైవ్ చేస్తూ  వెళ్తుండగా ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఆమెను దారుణమైన అసహ్యకరమైన  పరుషపదాలతో తిట్టడం మొదలుపెట్టాడు. కారు డ్రైవింగ్ చేస్తున్న ఆ మహిళ కారు విండో దగ్గరగా వెళ్లి మరీ వీడియో తీశాడు. అది గమనించి మహిళ వెంటనే కారు విండోగ్లాసును పైకెత్తింది. వీడియో వైరల్ కావడంతో వీడియో తీసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com