పూణే పేలుళ్ళ నిమిత్తం హైదరాబాద్ లో హై అలర్ట్
- October 15, 2017
కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. దీపావళి సందర్భంగా దేశంలోని ఏ ప్రాంతంలోనైనా పేలుళ్లు సంభవించవచ్చని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు రైల్వే స్టేషన్లు, బస్టాండుల్లో వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. మాల్స్, ప్రధాన కూడళ్లలో పోలీసులు మోహరించి, బహిరంగ సభలు, ర్యాలీలు, ధర్నాలు వంటివాటిని నిషేధించారు. నగరంలో నిషేధాజ్ఞలు వారంపాటు కొనసాగుతాయని సిపి మహేందర్‌రెడ్డి తెలిపారు. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద గట్టి భద్రత చర్యలు చేపట్టారు. ఔటర్ రింగ్‌రోడ్డు నుంచి రాకపోకలు నిర్వహించే వాహనాల తనిఖీ చేపట్టారు. హైదరాబాద్, సికిందరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో తనిఖీలు ముమ్మరం చేశారు. అదేవిధంగా షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్ల వద్ద నలుగురు, ఐదుగురు కలసి తిరగవద్దని, ప్రజలు గుమిగూడవద్దంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. డ్రంకైన్ డ్రైవ్‌తోపాటు నగరశివారుల్లో పెట్రోలింగ్ నిర్వహించనున్నట్టు సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









