ఈ రోజే గుజరాత్‌లో ప్రధాని మోడీ బారి బహిరంగ సభ
- October 16, 2017
సొంతరాష్ట్రం గుజరాత్‌లో ప్రధాని మోడీ మెగా బహిరంగ సభలో పాల్గొననున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో తిరిగి పాగా వేసే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోడీ భారీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. బీజేపీ నేతలు చేపట్టిన గుజరాత్ గౌరవ యాత్ర ముగింపు సందర్భంగా ఈ భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గాంధీనగర్‌కు సమీపంలోని భట్ గ్రామంలో కాసేపట్లో గుజరాత్ గౌరవ్ మహాసమ్మేళన్ ప్రారంభం కానుంది. బీజేపీ ప్రభుత్వ విజయాలను ప్రచారం చేసేందుకు ప్రతిష్టాత్మకంగా ఈ యాత్రను చేపట్టామని గుజరాత్ బీజేపీ నేతలు చెబుతున్నారు.
ర్యాలీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా పాల్గొననున్నారు. 4 వేల కిలోమీటర్ల పరిధిలో 149 నియోజకవర్గాల మీదుగా గుజరాత్ గౌరవ యాత్ర కొనసాగించారు. మరోవైపు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న క్రమంలో ఈ ర్యాలీ సందర్భంగా గుజరాతీలపై ప్రధాని వరాల జల్లు కురిపిస్తారని భావిస్తున్నారు. కేంద్ర, రాష్ర్ట సర్కార్ల విజయాలను వివరించడంతో పాటు ఓటర్లకు భారీ తాయిలాలు ప్రకటించే ఛాన్స్ ఉంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







