వేశ్య పాత్రలో కనువిందు చేయనున్న నటి సదా
- October 16, 2017
వేశ్యలపై వచ్చే కథలు ఎప్పుడూ ప్రేక్షకుల ఆదరణ పొందుతూనే ఉన్నాయి.. ప్రతి సుఖానికీ రేటుంటుంది ఈ లోకంలో కోరుకున్న సుఖం కోసం అడిగినంత రేటు పెట్టి మరీ కొంటారు కొందరు మగాళ్లు...!! పడక సుఖం తో సహా..!! మరి డబ్బుకోసం తమ మానాన్ని అమ్ముకొంటూ.. ఊరూపేరూ తెలియని వారికి పడక సుఖం అందిస్తున్న స్త్రీలు అందరూ ఇష్టంగానే ఆ వృత్తిని చేపట్టరా..? ఈ ప్రశ్ననే కథ గా మలిచి సినిమాగా తెరకెక్కిస్తునారు దర్శకుడు అబ్దుల్ మజిత్.. "టార్చ్ లైట్" పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వేశ్య పాత్రలో ప్రముఖ నటి సదా నటిస్తుంది. అర్ధరాత్రి హైవేల పక్కన నిలబడి విటుల కోసం వేచి చూసే వేశ్య పాత్రలో నటిస్తున్న సదా... తెలుగులో జయం సినిమాతో అడుగు పెట్టింది. ఇప్పటివరకూ ఎప్పుడూ కుటుంబ కథా చిత్రాల్లో.. తన హద్దుల్లో నటిస్తున్న సదా... అందాల ప్రదర్శన విషయంలో కూడా ఎక్కడా హద్దులు దాటలేదని చెప్పవచ్చు. కాగా దర్శకుడు సదా ని ఫస్ట్ ఛాయిస్ గా అనుకోలేదు.. చాలా మంది హీరోయిన్లు అడిగిన అబ్ధుల్ వారు వేశ్యగా నటించడానికి నో చెప్పగా... చివరికి సదా ని సంప్రదించగా.. కథ విన్న వెంటనే ఒకే చెప్పిందని.. అబ్దుల్ చెప్పారు. సదా బుల్లి తెరపై డ్యాన్స్ షో లకు జడ్జ్ గా వ్యవహరిస్తున్న సంగతి విధితమే..
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







