ఇండియా-యూఏఈ భాగస్వామ్య సదస్సుకు మంత్రి కేటీఆర్‌.!

- October 17, 2017 , by Maagulf
ఇండియా-యూఏఈ భాగస్వామ్య సదస్సుకు మంత్రి కేటీఆర్‌.!

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు మరొక ప్రతిష్టాత్మకమైన ఆహ్వానం లభించింది. అబుదాబి భారత రాయబార కార్యాలయం, దుబాయ్ మరియు యూఏఈ లోని ప్రముఖ పారిశ్రామిక సంఘం అయిన బిజినెస్ లీడర్స్ ఫోరమ్ నిర్వహించనున్న ఇండియా-యూఏఈ భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానం లభించింది. ఈ సమావేశంలో భారతదేశంతోపాటు గల్ప్ లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అధికారులు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు సుమారు ఎనిమిది వందలకుపైగా పాల్గోననున్నారు. దుబాయ్, యూఏఈ దేశాలతో భారత దేశ వాణిజ్య వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఈ నెల 30,31 తేదిల్లో ఈ సమావేశం దుబాయ్‌లో జరగనున్నది. 30న జరిగే మంత్రుల స్ధాయి సెషన్‌లో పాల్గోనాల్సిందిగా మంత్రిని నిర్వహాకులు కోరారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మద్య ఉండాల్సిన వ్యూహాత్మక వ్యాపార భాగస్వామ్యం, పెట్టుబడులు, పాలసీలు, టూరిజం వంటి అంశాలపైన మాట్లాడాల్సిందిగా కోరారు. దీంతోపాటు తెలంగాణలోని ఉన్న పెట్టుబడులు అవకాశాల, ప్రభుత్వ పారిశ్రామిక పాలసీలపైన కేటీఆర్ ప్రసంగించనున్నారు. ఇప్పటికే ఈ సమావేశంలో పాల్గోనాల్సిందిగా బిజినెస్ లీడర్స్ పోరమ్ మంత్రికి అహ్వానం పంపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com