ఇండియా-యూఏఈ భాగస్వామ్య సదస్సుకు మంత్రి కేటీఆర్.!
- October 17, 2017
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు మరొక ప్రతిష్టాత్మకమైన ఆహ్వానం లభించింది. అబుదాబి భారత రాయబార కార్యాలయం, దుబాయ్ మరియు యూఏఈ లోని ప్రముఖ పారిశ్రామిక సంఘం అయిన బిజినెస్ లీడర్స్ ఫోరమ్ నిర్వహించనున్న ఇండియా-యూఏఈ భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానం లభించింది. ఈ సమావేశంలో భారతదేశంతోపాటు గల్ప్ లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అధికారులు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు సుమారు ఎనిమిది వందలకుపైగా పాల్గోననున్నారు. దుబాయ్, యూఏఈ దేశాలతో భారత దేశ వాణిజ్య వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఈ నెల 30,31 తేదిల్లో ఈ సమావేశం దుబాయ్లో జరగనున్నది. 30న జరిగే మంత్రుల స్ధాయి సెషన్లో పాల్గోనాల్సిందిగా మంత్రిని నిర్వహాకులు కోరారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మద్య ఉండాల్సిన వ్యూహాత్మక వ్యాపార భాగస్వామ్యం, పెట్టుబడులు, పాలసీలు, టూరిజం వంటి అంశాలపైన మాట్లాడాల్సిందిగా కోరారు. దీంతోపాటు తెలంగాణలోని ఉన్న పెట్టుబడులు అవకాశాల, ప్రభుత్వ పారిశ్రామిక పాలసీలపైన కేటీఆర్ ప్రసంగించనున్నారు. ఇప్పటికే ఈ సమావేశంలో పాల్గోనాల్సిందిగా బిజినెస్ లీడర్స్ పోరమ్ మంత్రికి అహ్వానం పంపింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







