దుబాయ్‌ మాల్స్‌ ఎంట్రన్స్‌లలో ఇ-సిగరెట్స్‌ నిషేధం

- October 17, 2017 , by Maagulf
దుబాయ్‌ మాల్స్‌ ఎంట్రన్స్‌లలో ఇ-సిగరెట్స్‌ నిషేధం

దుబాయ్‌లోని షాపింగ్‌ సెంటర్స్‌, మాల్స్‌లలో ఇ-సిగరెట్లను వినియోగించడం నిషేధం. పబ్లిక్‌ ప్లేస్‌లు, షాపింగ్‌ మాల్స్‌లలో ఎలక్ట్రానిక్‌ సిగరెట్స్‌ని వినియోగించడాన్ని దుబాయ్‌ మునిసిపాలిటీ నిషేధించింది. ఈ నేపథ్యంలో మాల్స్‌ నిర్వాహకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయగా, మాల్స్‌ యాజమాన్యం తమ సిబ్బందిని అప్రమత్తం చేసింది. కొన్ని షాపింగ్‌ మాల్స్‌ నిబంధనల్ని ఉల్లంఘించి, తమ వినియోగదారులకు మాల్స్‌లోపల స్మోకింగ్‌ జోన్స్‌ ఏర్పాటు చేసినట్లుగా తమ దృష్టికి రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మునిసిపాలిటీ అధికారులు వెల్లడించారు. మునిసిపాలిటీకి చెందిన పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ రెధా సల్మాన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. 2099లో పబ్లిక్‌ ప్లేసెస్‌లో స్మోకింగ్‌ని బ్యాన్‌ చేయడం జరిగింది. ఇ-సిగరెట్లకూ ఇది వర్తిస్తుంది. పబ్లిక్‌ ప్లేస్‌లలో స్మోకింగ్‌ చేస్తే 1,000 దిర్హామ్‌ల వరకు జరీమానా విధించబడ్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com