పాకిస్థాన్‌లోని క్వెట్టాలో పేలుడు.. ఆరుగురి మృతి
- October 18, 2017
పాకిస్థాన్‌లోని క్వెట్టా ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు మృతిచెందగా.. 8 మంది గాయపడ్డారు. క్వెట్టా-సిబ్బి రహదారి సరియల్ మిల్లు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 35 మంది పోలీసులు వెళ్తున్న వాహనమే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు, భద్రతా సిబ్బంది క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులుగా ఇప్పటివరకూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకోలేదు.
బలూచిస్థాన్ ప్రాంతంలో ఇలాంటి హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి. క్వెట్టాలో ఆగస్టు 13న మిలటరీ వాహనం లక్ష్యంగా ముష్కరులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఘటనలో 15 మంది మృతి చెందారు. జూన్ 14న జరిగిన మరో ఆత్మాహుతి దాడిలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..









