సోషల్ మీడియా ఫర్ సోసైటీ ఆధ్వర్యంలో కొవ్వోత్తుల నివాళి
- October 18, 2017
విజయవాడ: కార్పోరేట్ కళాశాలలో చనిపోయిన విద్యార్ధులకు సోషల్ మీడియా ఫర్ సోసైటీ (ఎస్ ఎమ్ ఎస్ )ఆధ్వర్యంలో కొవ్వోత్తుల నివాళి అర్పించారు. ర్యాంకుల మాయలోపడి విద్యార్ధులను రోబోలుగా తయారు చేసి, విద్యార్ధుల పై ఒత్తిడి పెంచి మరీ వాళ్ల చావుకు కార్పోరేట్ కళాశాలలు కారణమౌతున్నాయని, విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం చూసిచూడనట్లు వ్యవహరిస్తుందే తప్ప కాలేజీలపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఎస్ ఎమ్ ఎస్ సంస్ధ ప్రతినిధులు తెలిపారు. చిరుదీపం వెలిగిద్దాం - ఆలోచన రేకేదిద్దాం -విద్యార్ధులను కాపాడుకుందాం- నవతరాన్ని నిర్మిద్దాం పేరుతో విజయవాడలోని రాఘవయ్య పార్క్ వద్ద చనిపోయిన విద్యార్ధుల చిత్రపటాల వద్ద కొవ్వోత్తులు వెలిగించి నివాళి అర్పించారు. సంస్ధ ప్రతినిధి సురేంద్ర మాట్లాడుతూ చక్రపాణి, రత్నకుమారి కమిటీల సిపార్సులు అమలు చేయకపోవడం కారణంగానే విద్యార్ధుల మరణాలు పెరిగిపోతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోనే నారాయణ విద్యాసంస్ధల అధిపతి మంత్రిగా ఉన్న కారణంగా ప్రభుత్వం స్పందించడంలేదని అనుమానం కలుగుతుందని, నిజంగా విద్యార్ధుల మరణాలపై స్పందిస్తే తక్షణం కార్పొరేట్ కళాశాలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్యకరమైన వాతావరణాన్ని విద్యార్ధులకు కలిపించాలని, లేకపోతే విద్యార్ధుల మరణాలు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు విజ్ఞాప్తి చేశారు.ర్యాంకుల పొటిలో విద్యార్ధుల జీవితాలతో ఆటలాడుతున్నా కార్పోరేట్ కళాశాలలో మీ పిల్లలను చేర్పించేముందు ఒక్కసారి ఆలోచించాలని, బలవంతంగా నారాయణ ,శ్రీచైతన్యలలో జాయిన్ చేసి ఒత్తికి గురిచేయవద్దని అన్నారు.
ఆహ్లదకరంగా గడపాల్సిన జీవితం బంధికానలో ఉన్నా విధంగా తయారవుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుగారు నారాయణ కళాశాలలో పర్యటించిన సందర్భంలో రోజుకు 18 గంటలు చదువుపేరుతో ఏ రంకంగా విద్యార్ధుల పట్ల కార్పోరేటు కళాశాలు వ్యవహారిస్తున్నాయో రాష్ట్రం మొత్తం తెలిసిందన్నారు. ప్రభుత్వ విద్యను కాపాడుకోవడం ద్వారానే విద్యార్ధుల మరణాలకు చెరమగీతం పాడగలం తప్ప కార్పోరేట్ కళాశాల వలన ఒత్తిడి తప్ప మరేమి మిగలడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ఫేస్ బుక్ గ్రూపు సభ్యులు , యూజర్స్ తో పాటు ఎస్ ఎమ్ ఎస్ నాయకులు పవన్, కె.శ్రీనివాస్, వర్ధిని, దినేష్, కృష్ణ జిల్లా కార్యదర్శి రవి, ఎస్ ఎప్ ఐ నగర నాయకులు , ఫేస్ బుక్ గ్రూప్ అడ్మిన్స్ ప్రవిణ్, మహేష్, కోటి, సుమంత్ లతో పాటు వివిధ కాలేజ్ విద్యార్ధులు పాల్గోన్నారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









