ఐదు వాయిదాల్లో రుణమాఫీ
- October 18, 2017
ఏపీలో మూడో విడత రుణమాఫీ మొదలైంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని రైతుల అప్పులు చెల్లిస్తోంది. అర్హులైన ప్రతి రైతుకు అందజేస్తామని.. రుణమాఫీ అమలు కమిటీ చైర్మన్ కుటుంబరావు అన్నారు. తమకు మాఫీ అందడం లేదంటూ ఫిర్యాదులు పెరుగుతుండడంపై ఆయన స్పందించారు.
రుణమాఫీ అందడానికి అర్హత పత్రం కీలకమన్నారు.. కుటుంబరావు. తొలి విడత సందర్భంగా తమకు ఏకంగా 10 లక్షల వరకు ఫిర్యాదులు అందాయని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చొరవతో యుద్ధ ప్రాతిపదికన క్లియర్ చేశామని చెప్పారు. వాటిల్లో చాలావరకు బ్యాంకుల్లో జరిగిన పొరపాట్లే ఉన్నాయి. అప్పుడు రిజక్ట్ ఐనవాళ్లు.. మళ్లీ ఫిర్యాదులు చేస్తున్నారని అన్నారాయన.
ఏపీ ప్రభుత్వం ఐదు వాయిదాల్లో రుణమాఫీని పూర్తి చేయనుంది. అవినీతికి ఆస్కారం లేకుండా ఉండేందుకే ఆన్లైన్లో చెల్లింపులు చేస్తోంది. ఎవ్వరు, ఎప్పుడు ఫిర్యాదు చేసినా స్వీకరిస్తామన్నారు. రిజర్వ్‌బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారమే అర్హుల ఎంపిక జరుగుతుందన్నారు. ఈ విషయంలో బ్యాంకులు కూడా రైతులకు, ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









