క్రాకర్స్ కాల్చడంలో సరికొత్త రికార్డులు
- October 18, 2017
దీపావళి పండుగంటే అందరికీ సరదానే. ఎప్పుడెప్పుడు టపాకాయలు కాలుద్దామా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఒకప్పుడు దీపాలు వెలిగించడంతోనే సంతృప్తి చెందారు. కానీ కాలం మారింది. చెవులు చిల్లులు పడే శబ్దాలతో బాంబులు పేలిస్తే గానీ దీపావళి జరుపుకున్నట్లుగా భావించడం లేదు. అంతటితో ఆగకుండా బాణాసంచా కాల్చడంలోనూ సరికొత్త రికార్డులు సృష్టించారు.
దీపావళి రోజున ఫార్మాలిటీ కోసం టపాసులు కాల్చేవారు కొందరైతే... రికార్డుల కోసం పేల్చేవారు మరికొందరు. 2011లో మాల్టా మక్బాలో అతిపెద్ద విష్ణుచక్రాన్ని కాల్చి రికార్డు స్రుష్టించడమే అందుకు ఉదాహరణ. దీని చుట్టుకొలత ఎంతో తెలుసా... 105 అడుగులు.
ఫిలిప్పీన్స్‌లో అయితే ఏకంగా గిన్నిస్ రికార్డే నెలకొల్పారు. గతేడాది 30 సెకన్లలో లక్షా 25వేల 801 తారాజువ్వల్ని వెలిగించడం ద్వారా గిన్నిస్ రికార్డు కెక్కారు. రికార్డుల విషయంలో ఇంగ్లాండ్ కూడా పోటీపడింది. 2009లో 6.5 సెకన్లలో లక్షా 10 వేల రకాల బాణసంచా కాల్చి సరికొత్త రికార్డును స్రుష్టించింది.
అతిపెద్ద చిచ్చుబుడ్డిని తయారు చేసిన ఘనత జపాన్ ది. 750 కిలోల బరువైన చిచ్చుబుడ్డిని 54.7 అంగుళాల వ్యాసంతో తయారు చేసి ఔరా అనిపించారు. ఇక టపాసులు కాల్చడం కోసం అత్యధికంగా పది లక్షల డాలర్లు ఖర్చు పెట్టిన ఘనత చైనా సొంతం. 2007లో ఏకంగా 13 కిలోమీటర్ల పొడవునా టపాసులను పరిచి కాల్చారు. ఇలా దీపావళి రోజున పండుగ సంబరంతోపాటు రికార్డులు సృష్టించడానికి వివిధ దేశాలు పోటీపడడం విశేషం.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







