బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం

- October 18, 2017 , by Maagulf
బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. పూరీకి దక్షిణ ఆగ్నేయ దిశగా 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం ఇవాళ అర్ధరాత్రి లేదా రేపు ఉదయానికి తీరం దాటనుంది. ఒడిశాలోని చాంద్‌బాలీ-పూరీ మధ్య ఇది తీరం దాటే అవకాశం ఉంది. మరో 18 గంటల్లో ఈ వాయుగుండం మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com