సంక్రాంతికి రానున్న 'రాజుగాడు'.!
- October 18, 2017
ఉయ్యాలా జంపాల , సినిమా చూపిస్తా మావ, ఈడో రకం వాడో రకం సినిమాలతో రాజ్ తరుణ్ హిట్స్ అందుకున్నప్పటికీ , ప్రస్తుతం మాత్రం వరుస డిజాస్టర్లతో సతమతవుతున్నాడు..ఓ హిట్ పడితే కానీ మనోడి జాతకం మారదు. ప్రస్తుతం రాజ్ తరుణ్ ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో నూతన దర్శకురాలు సంజనారెడ్డి దర్శకత్వం లో రాజుగాడు అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాను 2018 సంక్రాంతి బరిలో దించుతున్నట్లు చిత్ర యూనిట్ అధికారిక పోస్టర్ ను దీపావళి కానుకగా రిలీజ్ చేసారు. సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మూవీతోపాటు రామ్ చరణ్ రంగంస్థలం , శంకర్ రోబో 2 చిత్రాలు రాబోతున్నాయి. ఈ నేపథ్యం లో రాజుగాడు ఎలా హిట్ కొడతాడో చూడాలి.
మరో పక్క నిర్మాత రామబ్రహ్మం సుంకర మాట్లాడుతూ - " రాజుగాడు సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. లేడీ డైరెక్టర్ సంజనారెడ్డి సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. కామెడీ, లవ్, యాక్షన్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న ఎంటర్‌టైనర్ ఇది. రాజ్‌తరుణ్‌ను సరికొత్త పాత్రలో చూస్తారు. రాజేంద్రప్రసాద్‌గారు, రావు రమేష్‌గారు కీలక పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!







