విడుదలైన బెల్లంకొండ శ్రీనివాస్ 'సాక్ష్యం' మోషన్ పోస్టర్.!
- October 18, 2017
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా అభిషేక్ పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'సాక్ష్యం'. పూజా హెగ్డే కథానాయిక. శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ నామా నిర్మాత. బుధవారం హైదరాబాద్‌లో మోషన్ పోస్టర్ విడుదల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శ్రీవాస్ మాట్లాడుతూ ''కథకు తగ్గట్టుగా పేరు కుదిరింది. పరిశ్రమలో ప్రతి పదేళ్లకి ఒక మార్పు చోటు చేసుకొంటుంది. అలా పదేళ్ల నా దర్శకత్వ ప్రయాణానికి ఈ సినిమా ఓ మంచి మార్పుగా నిలుస్తుంది. నా కథలు భావోద్వేగంతో ఉంటాయి. ఇదివరకు లేని విజువల్ సపోర్ట్ ఇప్పుడు లభిస్తోంది. దాని సహకారంతో సినిమా తీద్దామనే ఈ కథ రాశా. ఎన్నో యూట్యూబ్ వీడియోల స్ఫూర్తితో పాటు, నేను అనుభవించిన జీవితంలోని మథనం ఈ కథ రూపంలో వచ్చింది. వ్యవస్థలన్నీ అవినీతిమయం అవ్వడానికి ఓ కారణం ఉంది. అది మన అంతరంగమే.
మన ఆలోచనల నుంచే తేడాలొస్తాయనే విషయాన్ని, పంచభూతాల నేపథ్యంతో ఈ సినిమా చేశా. ఇలాంటి ఓ కొత్త కథ చేస్తున్నప్పుడు అందరి సహకారం కావాలి. ఏం చేయమన్నా చేయడానికి సిద్ధపడ్డాడు కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్. నిర్మాత అభిషేక్ ఈ సినిమా కోసం ఏం చేయాలో అదంతా చేస్తున్నారు.
పూజా పాత్ర, నటన బాగుంటుంది'' అన్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ ''ఈ సినిమా కథ విన్నాక 'మన దర్శకులు ఇలా ఆలోచిస్తారా?' అనిపించింది. నాకు చాలా స్ఫూర్తినిచ్చిన కథ ఇది. మంచి కథాబలంతో నేను చేస్తున్న మొదటి సినిమా ఇది.
మేం అద్భుతమైన ప్రయత్నం చేశాం'' అన్నారు. పూజా హెగ్డే మాట్లాడుతూ ''మంచి కథ ఇది. నేను ఇదివరకు 'డీజే'లో చేసిన పాత్రకీ, ఈ సినిమాలోని పాత్రకీ చాలా వ్యత్యాసం ఉంటుంది'' అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ''ప్రతి విషయంలోనూ కొత్తదనం కనిపిస్తుంద''న్నారు.
మాటల రచయిత బుర్రా సాయిమాధవ్ మాట్లాడుతూ ''మన భారతీయతలో వాణిజ్య విలువలు ఎన్నుంటాయో అన్ని ఈ సినిమాలో ఉంటాయి. మామూలుగా ఏ దేశంలో ఉన్న పవిత్ర గ్రంథాలైనా భక్తిని బోధిస్తాయి. కానీ మనిషి బాగుండాలంటే భయం, భక్తి రెండు ఉండాలని చెప్పేది భారతీయత. ఆ భారతీయతకి ప్రతీకగా ఈ సినిమా నిలుస్తుంది.
ఇందులో ఒక్క వృథా పాత్ర ఉండదు. ఇలాంటి కథకి మాటలు రాయడం ఆనందంగా ఉంది. తప్పు చేయాలంటే ప్రతి ఒక్కరూ భయపడేలా ఈ సినిమా ఉంటుంద''న్నారు. ఈ కార్యక్రమంలో కాశీ విశ్వనాథ్, రాజసింహ, ఆనంద్, హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









