జకీర్ నాయక్‌కు వ్యతిరేకంగా మానవహక్కుల సంఘాలు
- October 19, 2017
వివాదస్పద ముస్లిం మత బోధకుడు జకీర్ నాయక్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని మలేషియాలోని మానవహక్కుల సంఘాలు కౌలాలంపూర్ హైకోర్టును అశ్రయించాయి. ప్రధానంగా మలేషియాలో జకీర్ నాయక్ శాశ్వత నివాస అనుమతి రద్దు చేయాలని 17 మానవ హక్కుల సంఘాలు కౌలాలంపూర్ హైకోర్టును కోరాయి. జకీర్ నాయక్‌పై భారత దేశంలో అనేక కేసులు నమోదవడంతో పాటు.. అక్కడి భారత దర్యాప్తు సంస్థలు అతన్ని వాంటెడ్ క్రిమినల్‌గా పేర్కొన్న విషయాన్ని.. మానవహక్కుల సంఘాలు కోర్టుకు తెలిపాయి. ఈ నేపథ్యంలో వివాదాస్పద మత బోధకుడు జకీర్ నాయక్ వల్ల మలేషియా భద్రత ప్రమాదంలో పడే అవకాశముందని.. అందువల్ల అతనికి గతంలో ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని హ్యూమన్ రైట్స్ కమిషన్ కోర్టును కోరింది.
మలేషియాలోని మలయా హక్కుల సంఘం నేతృత్వంలో ఏర్పడ్డ ఒక బృందం ఇది వరకే జకీర్ నాయక్‌పై దేశ బహిష్కరణ విధించాలని కోర్టులో కేసును పెట్టింది. ఈ కేసు ఈ నెల 21 కోర్టులో విచారణకు రానుంది. జకీర్ నాయక్‌కు చెందిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను భారత్ నిషేధించిన విషయాన్ని హక్కుల సంఘం కోర్టుకు తెలిపింది.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







