అమెరికాలోని పయనీర్ క్షేత్రాన్ని సందర్శించిన చంద్రబాబు..
- October 19, 2017
అమెరికాలో చంద్రబాబు బృందం పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. రెండోరోజు మొదట ఐయోవాలోని పయనీర్ గ్లోబల్ హెడ్ ఆఫీసుకు చేరుకున్న చంద్రబాబు... అక్కడి పరిశోధనా కేంద్రాన్ని సందర్శించారు అనంతరం.. అక్కడి సిబ్బందితో సమావేశమయ్యారు. ఆ తర్వాత పయనీర్ క్షేత్రాన్ని సందర్శించారు. వ్యవసాయ భూమిలో చంద్రబాబు స్వయంగా హార్వెస్టర్ నడిపారు. ఏపీలో తమ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నెలకొల్పనున్న మెగా సీడ్ పార్కు కార్యకలాపాలలో తమకు సహకరించాలని ‘పయనీర్’ సంస్థ శాస్త్రవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. దిగుబడులను పెంచి వ్యవసాయాన్ని లాభసాటి చేయడమే ఉమ్మడి లక్ష్యంగా పరస్పరం సహకరించుకుని ఇరు ప్రాంతాల రైతాంగ శ్రేయస్సుకు పాటుపడాలని చంద్రబాబు సూచించారు
యూఎస్ ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు... పలు విత్తన, వ్యవసాయ సంస్థలకు చెందిన సీఎఫ్‌వోలు, శాస్త్రవేత్తలతో సమావేశమయ్యారు. అనంతరం వరుస ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. మన రాష్ట్రంలో గరిష్టస్థాయిలో వ్యవసాయ దిగుబడుల పెంపుదల కోసం ఆయా అంశాలలో అవలంభించిన అన్ని పద్ధతులను అందిపుచ్చుకునే అవకాశాలపై ముఖ్యమంత్రి చర్చించారు.
ఐయోవా స్టేట్ యూనివర్సిటీ అధ్యక్షుడితో సమావేశమైన చంద్రబాబు పలు కీలక అంశాలపై చర్చించారు. అటు ఘనా సిఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్, ఐయోవా రాష్ట్రమంత్రి నార్తీతోనూ సమావేశమయ్యారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







