వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
- October 20, 2017
మనామా: ఓ డ్రైవర్, ఇద్దరు పాదచారులు మూడు వేర్వేరు ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు. మనామా, జెబ్లాత్ హబ్షి మరియు సనాద్లలో ఈ రోడ్డు ప్రమాదాలు జరిగాయి. కింగ్ ఫైసల్ హైవైపే రోడ్డు ప్రమాదం జరగ్గా, ఈ ఘటనలో బహ్రెయినీ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముహర్రాక్ వైపు వెళుతున్న వాహనం అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. మరో ఘటనలో బంగ్లాదేశీ వ్యక్తి సెహ్లా హైవే దాటుతుండగా ప్రాణాలు కోల్పోయాడు. జెబ్లాత్ హబ్షిలో రాత్రి 7 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇస్తిక్లాల్ హైవేపై సనద్ వద్ద జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో పాదచారి ఒకరు మృతి చెందారు. వేగంగా దూసుకొస్తున్న వాహనం, రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







