ఉత్తరాంధ్రకు తప్పిన వాయు'గండం'
- October 20, 2017
ఉత్తరాంధ్రకు వాయుగుండం ముప్పు తప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నిన్న రాత్రి పారాదీప్‌కు సమీపంలో తీరం దాటింది. ఇది.. చాంద్‌బలీకి పశ్చిమంగా 25 కిలోమీటర్ల దూరంతో భూమి పైన కేంద్రీకృతమై ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇది..తూర్పు ఈశాన్యదిశగా పయనిస్తూ క్రమేపీ బలహీనపడుతుందని వాతావరణశాఖ అదికారులు చెప్పారు. వాయుగుండం ప్రభావంతో రాగల 24 గంటల్లో శ్రీకాకుళం,విజయనగరం జిల్లాల్లో చాల చోట్ల వర్షాలు కురుస్తాయని అన్నారు. అదే సమయంలో ఉత్తరకోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని అన్నారు.. ఈ సమయంలో మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అదికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







