యువకుడి హత్య, ఇద్దరు బహ్రెయినీలకు జీవిత ఖైదు

- October 20, 2017 , by Maagulf
యువకుడి హత్య, ఇద్దరు బహ్రెయినీలకు జీవిత ఖైదు

మనామా: హై క్రిమినల్‌ కోర్టు, ఇద్దరు బహ్రెయినీలకు జీవిత ఖైదు విధించింది. ఓ యువకుడ్ని దారుణంగా హింసించి, హత్య చేసిన కేసులో ఈ శిక్ష విధించడం జరిగింది. పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌ అనే నెపంతో యువకుడ్ని ఈ ఇద్దరూ చిత్రవధ చేశారు. బాధితుడ్ని సయ్యెద్‌ అహ్మద్‌ సయెద్‌ మోసాగా గుర్తించారు. షకురా విలేజ్‌ నుంచి ఇతన్ని కిడ్నాప్‌ చేసిన నిందితులు, పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌ అనే నెపంతో తీవ్రంగా హింసించారు. ఆ హింసను తాళలేక అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు బాధితుడు. అతన్ని ఆ స్థితిలో గుర్తించిన పోలీసులు, సలమానియా మెడికల్‌ కాంప్లెక్స్‌కి తరలించారు. సోషల్‌ మీడియాలో అతని ఫొటోని చూసి, బాధితుడి తండ్రి అతన్ని గుర్తించడం జరిగింది. విచారణలో బాధితుడి స్నేహితుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారణ అయ్యింది. అతనితోపాటు మరో వ్యక్తి కూడా ఈ ఘటనలో దోషిగా తేలడంతో ఇద్దరికీ జీవిత ఖైదు విధించింది న్యాయస్థానం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com