రెండు జన్మల కథతో పూరి తనయుడు నటిస్తున్న 'మెహబూబా'
- October 21, 2017
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం తన తనయుడు ఆకాష్ పూరి హీరోగా మెహబూబా సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 1971లో భారత్, పాకిస్తాన్ ల మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారట. భారత్ పాక్ యుద్ధం కాలంలో చనిపోయిన ప్రేమ జంట తిరిగి ఈ కాలంలో పుట్టటం అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆకాష్ సరసన నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సందీప్ చౌతా సంగీతమందిస్తున్నారు. పూరి తన సొంత బ్యానర్ లో మెహబూబా సినిమాను నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!







