యూఎస్-భారత్ సంబంధాలపై చైనా అక్కసు వెళ్లగక్కింది
- October 21, 2017అమెరికా-భారత్ మధ్య సత్సంబంధాలపై చైనా మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది. భారత్ ఎదుగుదలను వాషింగ్టన్ ఎంతమాత్రం అంగీకరించబోదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు 'చైనా గ్లోబల్ టైమ్స్' ఓ కథనాన్ని ప్రచురించింది. భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను చైనా ఎంతమాత్రం వ్యతిరేకించదంటూనే.. తమ దేశాన్ని లక్ష్యంగా చేసుకుంటూ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని పేర్కొంది.
'బీజింగ్‌ను ఎదుర్కొనేందుకు భారత్‌ను ఉపయోగించుకోవాలని అమెరికా భావిస్తోంది. భారత్-చైనా మధ్య ఉన్న విబేధాలను అడ్డం పెట్టుకొని యూఎస్ లబ్ధిపొందాలని అనుకుంటోంది. భారత్ ఒకింత ఒత్తిడికి లోనవుతోంది. చైనాతో దూరం పెరిగిపోతోందని ఆ దేశం ఆందోళన చెందుతోంది. వాషింగ్టన్ ఏ దేశాన్ని శక్తిమంతంగా ఎదగనివ్వదు, అది చైనా అయినా.. భారత్ అయినా కావొచ్చు.' అని కథనంలో పేర్కొంది. భారత్-చైనా మధ్య ఇటీవల నెలకొన్న డోక్లామ్ ప్రతిష్టంభన సమయంలో కూడా డ్రాగన్ అమెరికాను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసింది.
అమెరికాకు భారత్ విశ్వసనీయమైన భాగస్వామి.. మరో శతాబ్దమైనా ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయని యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ రెక్స్ టిల్లర్సన్ వ్యాఖ్యానించిన రెండు రోజుల వ్యవధిలోనే చైనా తన వక్రబుద్ధి చూపించుకుంది. టిల్లర్సన్ బుధవారం భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలను ప్రశంసిస్తూనే.. చైనాకు చురకలేశారు. దక్షిణ చైనా సముద్రంపై అధిపత్యం కోసం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే సహించేది లేదని ఆయన తేల్చిచెప్పారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







